నాకు పారితోషికం కంటే పాత్ర ముఖ్యం: సీనియర్ నటి సుధ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు పారితోషికం కంటే పాత్ర ముఖ్యం: సీనియర్ నటి సుధ

  • ఒకప్పుడు మంచి పాత్రలు చేశాను 
  • ఇప్పటి పాత్రల్లో విషయం ఉండటం లేదు 
  • పాత్ర నచ్చితేనే చేస్తానన్న సుధ
తెలుగు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 'సుధ'కి మంచి పేరు వుంది. తల్లిగా .. అక్కగా .. వదినగా ఆమె ఎన్నో విభిన్నమైన పాత్రల ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "ఇంతకుముందు 'ఆమె' .. 'గ్యాంగ్ లీడర్' వంటి ఎన్నో సినిమాల్లో విలక్షణమైన పాత్రలను చేశాను. ఆ పాత్రలు నాకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఒక నటిగా నాకు సంతోషాన్ని .. సంతృప్తిని ఇచ్చాయి.

కానీ ఇటీవల కాలంలో వస్తోన్న పాత్రల్లో ఎలాంటి విషయం ఉండటం లేదు. అందుకే సినిమాల సంఖ్యను తగ్గించేసుకున్నాను. కొన్ని సందర్భాల్లో మనసు చంపుకుని చేస్తున్నాను. డబ్బుకోసమే అయితే ఈ పాటికి ఇంకా ఎక్కువ సినిమాలు చేసి ఉండేదానిని. ఒక నటిగా నా సంతృప్తి నాకు ముఖ్యం గనుక, నా మనసుకు నచ్చిన పాత్రలను మాత్రమే అంగీకరిస్తున్నాను. చేసిన ప్రతి పాత్ర నన్ను ఒక మెట్టు పైనుంచాలనేదే నా తాపత్రయం" అని చెప్పుకొచ్చారు.
Sudha

More Telugu News