నెల్లూరులో అక్రమ కట్టడాలంటూ టీడీపీ నేతల మూడు ఇళ్లను కూల్చేశారు!: నారా లోకేశ్ ఆగ్రహం
- కూల్చివేతలే లక్ష్యంగా వైసీపీ పాలన సాగుతోంది
- ఈ దౌర్జన్యానికి పోలీసులు అండగా నిలుస్తున్నారు
- జగన్ గారూ.. అధికారం మీకు శాశ్వతం కాదు
- ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత, మాజీ మంత్రి
ముఖ్యమంత్రి జగన్ కు కక్షసాధింపులు, కూల్చడాలే చేతనవుతాయని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్.. టీడీపీ నేతల ఇళ్లను కూల్చివేస్తున్న ఫొటోలను పోస్ట్ చేశారు.