తెలంగాణలో 16 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్!
- రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్న 330 ప్రైవేటు ఆసుపత్రులు
- ఏడాదిన్నరగా రూ.1500 కోట్ల బకాయిలు
- బకాయిలు రూ.800 కోట్లేనంటున్న ప్రభుత్వం
ఆరోగ్య శ్రీ కింద రాష్ట్రవ్యాప్తంగా 330 ఆసుపత్రులు సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో నెట్‌వర్క్ ఆస్పత్రులు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికే ప్రభుత్వం ఏకంగా రూ.70 కోట్లు చెల్లించాల్సి ఉందని సమాచారం. బకాయిలు చెల్లిస్తామంటూ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదివారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో అసోసియేషన్ పేర్కొంది. బకాయిల విడుదల విషయమై నేడు ఆరోగ్యశాఖ మంత్రి ఈటలతో పాటు ఆరోగ్యశ్రీ సీఈవోను కలవనున్నట్టు అసోసియేషన్ ముఖ్యులు తెలిపారు.