హిందీ 'జెర్సీ'కి షాహిద్ నే ఖరారు చేశారట
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిందీ 'జెర్సీ'కి షాహిద్ నే ఖరారు చేశారట

  • తెలుగులో హిట్ కొట్టిన 'జెర్సీ'
  • నాని కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిన సినిమా 
  • హిందీ రీమేక్ కి భారీ సన్నాహాలు 
తెలుగులో నాని హీరోగా చేసిన 'జెర్సీ' విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, నాని కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

తెలుగులో ఈ సినిమాను నిర్మించిన సూర్యదేవర నాగవంశీతో కలిసి, అల్లు అరవింద్ - దిల్ రాజు హిందీలో ఈ సినిమాను చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. 'అర్జున్ రెడ్డి' రీమేక్ గా చేసిన 'కబీర్ సింగ్' హిట్ కావడంతో షాహిద్ కపూర్ మాంఛి ఊపుమీదున్నాడు. ఆయనతో 'జెర్సీ' రీమేక్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నిర్మాతలు సంప్రదించారట. తప్పకుండా చేస్తానని షాహిద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, వాళ్లంతా మిగతా పనుల్లో నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది.
Nagavamsi
Allu Aravind
Dil Raju

More Telugu News