బీడీ కొనివ్వలేదని ఎస్కార్ట్ పోలీసుపై ఖైదీ దాడి
- కేరళలోని త్రిసూరు జిల్లాలో ఘటన
- ఖైదీ దాడిలో గాయపడిన కానిస్టేబుల్
- పారిపోయేందుకు ప్రయత్నించిన ఖైదీని పట్టుకున్న స్థానికులు
బీడీ కొనుక్కునేందుకు రామచంద్రన్ ప్రయత్నించగా ఎస్కార్ట్‌గా ఉన్న ప్రబీన్ అనే కానిస్టేబుల్ అందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఖైదీ.. ప్రబీన్‌పై దాడి చేశాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించగా చుట్టుపక్కల వారు పట్టుకుని అప్పగించారు. ఖైదీ దాడిలో గాయపడిన ప్రబీన్‌ను ఆసుపత్రికి, రామచంద్రన్‌ను పూజాపుర జైలుకు తరలించారు.