తన భార్య అరెస్ట్ పై రాబర్ట్ వాద్రా స్పందన
- బాధితులను పరామర్శించడం నేరమా?
- ప్రియాంక అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధం
- ఆమెను వెంటనే విడుదల చేయాలి
ఈ ఘటనపై ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. హింసాత్మక ఘటనలో ప్రాణాలను కోల్పోయిన వ్యక్తుల కుటుంబీకులను పరామర్శించడం నేరమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రియాంక అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధమని, ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని అవలంబిస్తోందని మండిపడ్డారు.