ఆ టైంలో తమరు గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారేమో: జగన్‌పై లోకేశ్ ధ్వజం
- ఎంతో సంస్కారవంతమైన భాషలో అడిగారు
- పత్రికల్లో వచ్చిన వార్తలు చూడవచ్చు
- ఇలాంటివి చూసే టైం ఉండి ఉండదు
‘‘కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా ? అని వైఎస్ జగన్ గారు ఎంతో సంస్కారవంతమైన భాషలో ఈ రోజు అసెంబ్లీలో అడిగారు. ఇది జూన్ 21, 2018న మీ అవినీతి 'సాక్షి'లో వచ్చిన వార్త(వార్తను షేర్ చేశారు). అలాగే మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా చూడవచ్చు. కాళేశ్వరంపై అప్పుడు చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేసిన వార్త పేపర్లలో వచ్చింది. ఆ టైంలో తమరు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారేమో, ఇలాంటివి చూసే టైం ఉండి ఉండదు’’ అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు.