నా టైమ్ బాగుంది: హీరో నాగచైతన్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా టైమ్ బాగుంది: హీరో నాగచైతన్య

  • శేఖర్ కమ్ములతో చైతూ మూవీ
  • కోరిక నెరవేరిందన్న చైతూ
  • డిసెంబర్లో విడుదల చేసే ఆలోచన
నాగచైతన్య - సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టుగా ఎనౌన్స్ మెంట్ జరిగిపోయింది. ఏషియన్ సంస్థవారు ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఈ సినిమాను గురించి చైతూ ఒక ట్వీట్ చేశాడు.

"హీరోగా నా కెరియర్ మొదలైన దగ్గర నుంచి, శేఖర్ కమ్ములతో చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. అలాంటి అవకాశం ఇన్నాళ్లకి వచ్చింది. ఇంతకాలానికి నా కోరిక నెరవేరుతున్నందుకు .. నా కల నిజమవుతున్నందుకు చాలా సంతోషంగా వుంది. నా టైమ్ బాగుంది .. అందుకే ఇంత మంచి అవకాశం వచ్చింది" అని రాసుకొచ్చాడు. సెప్టెంబర్ మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టేసి, డిసెంబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
nagachaitanya
saipallavi

More Telugu News