అంజలి - రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రధారులుగా 'ఆనంద భైరవి'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంజలి - రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రధారులుగా 'ఆనంద భైరవి'

  • వైజాగ్ లో తొలి షెడ్యూల్ పూర్తి 
  • తదుపరి షెడ్యూల్ హైదరాబాదులో
  •  రాయ్ లక్ష్మిపై యాక్షన్ సీన్స్ 
ఇటీవల కాలంలో నాయిక ప్రాధాన్యత గల చిత్రాల సంఖ్య పెరిగిపోతోంది. ఒకరికి మించిన నాయికల చుట్టూ అల్లిన కథలు కూడా థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. కర్రీ బాలాజీ దర్శకత్వంలో ఈ తరహాలోనే ఒక కథ రూపొందుతోంది. అంజలి - రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రధారులుగా ఆయన 'ఆనంద భైరవి' సినిమా చేస్తున్నాడు.అంజలి జోడీగా ఆదిత్ అరుణ్ చేస్తున్నాడు. ఇటీవలే తొలి షెడ్యూల్ ను వైజాగ్ పరిసర ప్రాంతాల్లో మొదలుపెట్టి, అక్కడి షూటింగును పూర్తిచేశారు. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను .. రాయ్ లక్ష్మిపై యాక్షన్ సీన్స్ ను ఇక్కడ చిత్రీకరించనున్నారు. రమేశ్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో, సుమన్ .. మురళీ శర్మ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.
anjali
lakshmi rai

More Telugu News