ఈసారి వరల్డ్ కప్ విజేతకు కళ్లుచెదిరే ప్రైజ్ మనీ

  • కప్ గెలిచిన జట్టుపై కాసుల వర్షం
  • ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక నగదు బహుమతి
  • ఈ నెల 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ పోటీలు
క్రికెట్ ప్రేమికులకు పసందైన విందు అందించేందుకు మరో మెగా సంబరం మొదలుకానుంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ నెల 30 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలో 10 అగ్రశ్రేణి జట్లు పాల్గొంటున్నాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 14న లార్డ్స్ మైదానంలో జరగనుంది. టోర్నీలో ఈసారి అనుబంధ సభ్య దేశాల జట్లకు స్థానం కల్పించకపోవడం ఆశ్చర్యకరమైన నిర్ణయం.

ఇక అసలు విషయానికొస్తే, ఈసారి టోర్నీలో విజేతకు అందించే ప్రైజ్ మనీ గతంలో ఎన్నడూ ఇవ్వనంత స్థాయిలో ఉంది. విజేతకు రూ.28 కోట్లు నగదు బహుమతిగా అందిస్తారు. రన్నరప్ గా నిలిచిన జట్టు సైతం రూ.14 కోట్లు అందుకోనుంది. సెమీఫైనల్ తో సరిపెట్టుకున్న జట్లకు రూ.5.6 కోట్లు ఇవ్వనున్నారు.
Go Back to Shorts
Cricket

More Telugu News