నన్ను సినిమాల్లోకి పంపించడానికి మా అమ్మ భయపడింది .. ఆమెకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను: నటుడు ప్రదీప్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నన్ను సినిమాల్లోకి పంపించడానికి మా అమ్మ భయపడింది .. ఆమెకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను: నటుడు ప్రదీప్

  • నాటకాలు వేయడమంటే ఇష్టం 
  • మా నాన్న నన్ను ప్రోత్సహించారు
  • జంధ్యాలగారు చూసి సినిమాల్లోకి రమ్మన్నారు
అటు వెండితెరపై .. ఇటు బుల్లితెరపై నటుడిగా ప్రదీప్ మంచి పేరు తెచ్చుకున్నారు. నటన వైపుకు తన అడుగులు ఎలా పడాయనేది తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. "చిన్నప్పటి నుంచి నాకు నాటకాలు అంటే ఇష్టం. ఆ దిశగా మా నాన్నగారు నన్ను ప్రోత్సహించారు. కాలేజ్ చదువులకి వచ్చాక హైదరాబాద్ - రవీంద్రభారతిలో ఒక నాటకం వేస్తూ, జంధ్యాల గారిని ముఖ్య అతిథిగా పిలిచాము.

ఆ నాటకం చూసిన ఆయన, హీరోగా సినిమాల్లోకి వచ్చేయమని నన్ను అడిగారు. మరుసటి రోజు మా ఇంటికి వచ్చి అమ్మా నాన్నలను అడిగారు. " సినిమాల్లోకి వెళితే స్మోక్ చేయడం .. డ్రింక్ చేయడం .. చెడు స్నేహాలు చేయడం ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి .. అందువలన నేను పంపించను" అని మా అమ్మ తేల్చి చెప్పింది. 'అమ్మా .. అవే నీ భయానికి కారణమైతే ఎప్పటికీ వాటి జోలికిపోను .. సరేనా' అని మా అమ్మకి మాట ఇచ్చాను. ఇప్పటికీ ఆ మాటకి కట్టుబడే వున్నాను" అని ఆయన చెప్పుకొచ్చారు. 
pradeep

More Telugu News