తెలుగు రాష్ట్రాల్లో 'మహర్షి' తొలివారం వసూళ్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు రాష్ట్రాల్లో 'మహర్షి' తొలివారం వసూళ్లు

  • ఈ నెల 9వ తేదీన వచ్చిన 'మహర్షి'
  • తొలివారంలో నైజామ్ షేర్ 21.67 కోట్లు 
  • తెలుగు రాష్ట్రాల షేర్ 59.37 కోట్లు
భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో 'మహర్షి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు చిత్రపరిశ్రమలో ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి ఈ సినిమాను నిర్మించడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇక దర్శకుడిగా వంశీ పైడిపల్లికి గల ఇమేజ్ .. మహేశ్ బాబు .. పూజా హెగ్డేకి గల క్రేజ్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. మహేశ్ బాబు డిఫరెంట్ లుక్స్ తో పోస్టర్స్ పై కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

అలా ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటివారంలో ఈ సినిమా 59.37 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తొలివారంలో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 21.67 కోట్ల షేర్ ను సాధించడం విశేషం. మహేశ్ బాబు కెరియర్లోనే ఇవి అత్యధిక వసూళ్లని చెబుతున్నారు. మహేశ్ బాబు అభిమానులు కోరుకున్నట్టుగానే ఆయనకి భారీ విజయం దక్కింది.
Mahesh Babu
pooja hegde

More Telugu News