మాజీ ఎమ్మెల్సీ రామ్ రెడ్డి మృతి.. స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు!
- టీడీపీ మీడియా కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి తండ్రే రామ్ రెడ్డి
- ప్రకాశ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు
- రామ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన
ఈరోజు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ..‘తెలంగాణ టీడీపీ మీడియా కార్యదర్శి జి.ప్రకాశ్ రెడ్డి తండ్రి, శాసనమండలి మాజీ సభ్యులు శ్రీ జి.రామ్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. శత వసంతాల జీవితంలో ప్రజాసేవకే రామ్ రెడ్డి అంకితమయ్యారు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను’ అని తెలిపారు.