పోయిన బెంగళూరు... హైదరాబాద్ నూ వెంటేసుకెళ్లింది!
- ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరలేకపోయిన ఆర్సీబీ
- చివరి మ్యాచ్ లో హైదరాబాద్ పై గెలుపు
- నేడు కోల్ కతా సన్ రైజర్స్ ఓడితేనే ప్లే ఆఫ్ కు సన్ రైజర్స్
కాగా, నిన్న రాత్రి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తమ సొంతగడ్డపై ఆర్సీబీ చెలరేగింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేయగా, బెంగళూరు జట్టు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి విజయం సాధించింది. బెంగళూరు జట్టులో హెట్ మైర్ (47 బంతుల్లో 75; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), గురుకీరత్ (48 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్)లు నాలుగో వికెట్ కు ఏకంగా 144 పరు గులు జోడించి జట్టుకు విజయాన్ని అందించారు.