వరుణ్ ధావన్ అంటే నాకు పిచ్చిప్రేమ: హీరోయిన్ అనన్య పాండే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరుణ్ ధావన్ అంటే నాకు పిచ్చిప్రేమ: హీరోయిన్ అనన్య పాండే

  • రంగంలోకి దిగుతోన్న అనన్య పాండే
  • 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో పరిచయం
  •  వరుణ్ ధావన్ అంటే ఇష్టం
బాలీవుడ్ వెండితెరపై సందడి చేయడానికి మరో నట వారసురాలు సిద్ధమైపోతోంది. ఆ వారసురాలు ఎవరో కాదు .. చుంకీపాండే కూతురు అనన్య పాండే. బాలీవుడ్ తెరపై హవా కొనసాగిస్తోన్న యువ కథానాయికలకు గట్టిపోటీ ఇవ్వడానికి అనన్య పాండే రంగంలోకి దిగుతోంది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు ఆమె రానుంది.

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమా ద్వారా పరిచయమైన వరుణ్ ధావన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా వరుణ్ ధావన్ ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. అలాంటి వరుణ్ ధావన్ అంటే నాకు పిచ్చిప్రేమ' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల వరుణ్ ధావన్ పుట్టినరోజు సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే టు యూ స్టూడెంట్ .. నువ్వంటే నాకు ఎప్పటికీ ఓ క్రష్' అంటూ ట్వీట్ కూడా చేసింది.
ananya
varun dhavan

More Telugu News