జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదం పెరగడానికి మోదీనే కారణం: ఒమర్ అబ్దుల్లా
- 2014తో పోలిస్తే రాష్ట్రంలో పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది
- ఎమ్మెల్యేలను కొని, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం బీజేపీకి అలవాటే
- సజ్జాద్ ఘనీ లోనీని సీఎం చేసేందుకు కూడా యత్నించారు
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడం లేదని ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. 1996 తర్వాత రాష్ట్రంలో సకాలంలో అసెంబ్లీకి ఎన్నికలు జరగకపోవడం ఇదే తొలిసారని విమర్శించారు. 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారన్న మోదీ వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఎమ్మెల్యేలను కొనడం ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. గోవాలో ఇదే చేశారని, కర్ణాటకలో కూడా ఇదే చేయాలనుకున్నారని, అయితే కోర్టు అడ్డుకోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వారు ఇదే ధోరణితో రాజకీయం చేశారని మండిపడ్డారు.
జమ్ముకశ్మీర్ లోని పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జాద్ ఘనీ లోనీని ముఖ్యమంత్రిని చేసేందుకు కూడా బీజేపీ యత్నించిందని ఆరోపించారు.