ఆగస్టు నుంచి కొరటాలతో సెట్స్ పైకి చిరంజీవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆగస్టు నుంచి కొరటాలతో సెట్స్ పైకి చిరంజీవి

  • చిరంజీవి తాజా చిత్రంగా 'సైరా'
  • తదుపరి సినిమా కొరటాలతో 
  • ముఖ్య పాత్రల్లో సునీల్ .. అనసూయ     
ప్రస్తుతం చిరంజీవి 'సైరా' సినిమా షూటింగుతో బిజీగా వున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి తదుపరి సినిమాపై కూడా అభిమానులు దృష్టి పెట్టారు. చిరంజీవి నెక్స్ట్ మూవీ కొరటాలతో వున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసిన కొరటాల ఈ సినిమాను ఆగస్టులో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.

పెద్ద గ్యాప్ లేకుండా రెగ్యులర్ షూటింగును మొదలుపెడతారని అంటున్నారు. వినోదంతో పాటు సందేశంతో కూడిన కథగా ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. కథానాయికలుగా తమన్నా .. శ్రుతిహాసన్ పేర్లు వినిపిస్తున్నాయిగానీ, ఇంకా క్లారిటీ రాలేదు. సునీల్ .. అనసూయ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారనే టాక్ మాత్రం వినిపిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.
chiranjeevi
Koratala Siva

More Telugu News