'మజిలీ' హిట్ ఎఫెక్ట్.. కోటి రూపాయలు పెంచేసిన చైతూ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మజిలీ' హిట్ ఎఫెక్ట్.. కోటి రూపాయలు పెంచేసిన చైతూ!

  • చైతూకి హిట్ ఇచ్చిన 'మజిలీ'
  • చైతూ కెరియర్లోనే అత్యధిక వసూళ్లు
  • సెట్స్ పై 'వెంకీమామ' సినిమా 
గట్టి హిట్ ఒకటి పడితే హీరో హీరోయిన్లు వెంటనే పారితోషికం పెంచేయడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. తమిళంలో 'సూపర్ డీలక్స్' .. తెలుగులో 'మజిలీ' హిట్ కావడంతో సమంత తన పారితోషికం పెంచేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు చైతూ కూడా పెంచేశాడనేది ఫిల్మ్ నగర్ టాక్.

కొంతకాలంగా చైతూకి హిట్ లేదు. విజయాల కోసం ఆయన ఎంతో సహనంతో ఎదురుచూస్తూ, ఇటీవల 'మజిలీ' చేశాడు. ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ, చైతూ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. దాంతో ఆయన ఇప్పుడు తీసుకుంటున్న పారితోషికానికి మరో కోటి చేర్చి చెబుతున్నట్టుగా సమాచారం. భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి పారితోషికం పెంచేశారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం 'వెంకీమామ' చేస్తోన్న చైతూ, ఆ తరువాత సినిమాను అజయ్ భూపతితో చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
nagachaitanya

More Telugu News