కాంగ్రెస్ సీనియర్ నేత డిగ్గీ రాజా సభలో మాట్లాడిన యువకుడికి బీజేపీ సన్మానం
- మోదీ సర్జికల్ స్ట్రయిక్స్‌ను ప్రస్తావించిన అమిత్
- ఉగ్రవాదులను మట్టు బెట్టారని వెల్లడి
- వేదికపై నుంచి కిందకు దించేసిన కాంగ్రెస్ నేతలు
వీడియోను చూసిన బీజేపీ, అమిత్‌పై ప్రశంసలు కురిపించడమే కాకుండా అతన్ని తమ పార్టీ కార్యాలయానికి రప్పించి మరీ సన్మానించింది. ఈ సందర్భంగా అమిత్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ సభలో భాగంగా దిగ్విజయ్, ఎవరికైనా తమ అకౌంట్లలో రూ.15 లక్షలు జమ అయ్యాయా? అని ప్రశ్నించినపుడు తాను చెయ్యి పైకెత్తానని, దీంతో తనను వేదిక పైకి పిలిచారన్నారు. ఆ సమయంలోనే తాను సర్జికల్ దాడుల గురించి మాట్లాడటంతో తనను స్టేజిపై నుంచి కిందకు పంపేశారన్నారు. అయినప్పటికీ అక్కడున్న వారు ఎవరూ కూడా తనతో అనుచితంగా ప్రవర్తించలేదని అమిత్ తెలిపారు.