మహేశ్ బాబు నెక్స్ట్ మూవీలో శ్రీమంతుడైన అమాయకుడి పాత్రలో బండ్ల గణేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ బాబు నెక్స్ట్ మూవీలో శ్రీమంతుడైన అమాయకుడి పాత్రలో బండ్ల గణేశ్

  • మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి సినిమా
  • ముఖ్యమైన పాత్రలో బండ్ల గణేశ్
  •  విజయశాంతి రీ ఎంట్రీ అంటూ టాక్
నటుడిగా .. భారీ చిత్రాల నిర్మాతగా బండ్ల గణేశ్ చాలామందికి తెలుసు. కొంతకాలంగా సినిమాలకి దూరంగా వుంటూ వచ్చిన ఆయన, నటుడిగా మళ్లీ తెరపై సందడి చేయనున్నట్టుగా తెలుస్తోంది. 'ఎఫ్ 2'తో భారీ విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి, తన తదుపరి సినిమాను మహేశ్ బాబుతో రూపొందించనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం బండ్ల గణేశ్ ను అనిల్ రావిపూడి ఒప్పించినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది.

శ్రీమంతుల కుటుంబానికి చెందిన అమాయకుడిగా ఈ సినిమాలో బండ్ల గణేశ్ కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఈ పాత్రను పూర్తిస్థాయి హాస్యభరితంగా అనిల్ రావిపూడి తీర్చిదిద్దాడనీ, బండ్ల గణేశ్ నాన్ స్టాప్ గా నవ్విస్తాడని అంటున్నారు. ఈ సినిమాతో బండ్ల గణేశ్ కమెడియన్ గా మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదే సినిమా ద్వారా విజయశాంతి కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తోంది. 
bandla ganesh
anil ravipudi

More Telugu News