అమాయకులపై దాడి అమానుషం.. ఈ నీచమైన చర్యను ఖండిస్తున్నా!: ఏపీ మంత్రి నారా లోకేశ్
- ఈస్టర్ రోజున చర్చ్ లు, హోటళ్లపై దాడి
- 252 మంది దుర్మరణం, వందలాది మందికి గాయాలు
- ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత
ఈరోజు ట్విట్టర్ లో నారా లోకేశ్ స్పందిస్తూ..‘శ్రీలంకలో ప్రశాంతంగా ప్రార్ధనలు చేసుకుంటున్న అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రవాదుల దాడి అమానుషం. కేవలం కొంతమంది మూర్ఖత్వానికి ఇలా వందలమంది మరణించడం చాలా బాధాకరం. ఉగ్రవాదుల నీచమైన చర్యలను ఖండిస్తున్నాను. దాడిలో మరణించిన వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.