అందుకే విడాకులు తీసుకున్నాము .. విడిపోయాము: అర్బాజ్ ఖాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే విడాకులు తీసుకున్నాము .. విడిపోయాము: అర్బాజ్ ఖాన్

  • సమస్య గురించి ప్రస్తావించకూడదు
  •  తన ఇష్టం అన్నట్టుగా ఉండేది
  •  అడ్డు చెబితే గొడవే జరిగేది    
భార్యాభర్తలుగా అర్బాజ్ ఖాన్ .. మలైకా అరోరా దాదాపు 19 యేళ్ల పాటు కలిసి జీవించారు. ఆ తరువాత ఆ కాపురంలో కలహాలు చోటుచేసుకోవడంతో ఇద్దరూ విడిపోయారు. చట్టబద్ధంగా ఇద్దరూ విడిపోయినా, అందుకు గల కారణాలు ఏమిటనేది అర్బాజ్ ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించలేదు. అనుపమ చోప్రా నిర్వహిస్తోన్న చాట్ షోలో తాజాగా పాల్గొన్న ఆయన, తాను .. మలైకా విడిపోవడానికి గల కారణాన్ని గురించి తొలిసారిగా చెప్పాడు.

"భార్యాభర్తలుగా మా మధ్యగల సంబంధం రాన్రాను సన్నగిల్లుతూ వచ్చింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడితే, 'నా జీవితం .. నా ఇష్టం' అన్నట్టుగా ఆమె వ్యవహరించేది. తన ఇష్టానికి అడ్డు చెప్పినా .. అభ్యంతరపెట్టినా గొడవైపోయేది. ఎవరి జీవితాలు వాళ్లవి అనే భావన వచ్చిన తరువాత భార్యాభర్తలుగా కలిసి ఉండటంలో అర్థం లేదు. అందుకే విడాకులు తీసుకుని విడిపోయాము" అని చెప్పుకొచ్చాడు. 
arbaaz khan
malaika

More Telugu News