'మా బాధ వినండి' అంటూ జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగుల ఆందోళన
- నిరసన చేపట్టిన ఉద్యోగులు
- నగదు కొరతతో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్‌వేస్
- బాగున్నప్పుడు 119 విమానాలు తిప్పింది
ఈ విమానయాన సంస్థ నగదు కొరతతో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్‌వేస్ రుణదాతలను తాత్కాలిక సాయం కోరింది. ఆ నిధులతో ఉద్యోగులకు వేతనాలు చెల్లించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సంస్థ బాగున్నప్పుడు అత్యధికంగా 119 విమానాలను దేశీయ, విదేశీ మార్గాల్లో తిప్పింది. శని, ఆది వారాల్లో ప్రస్తుతం ఆ సంస్థ కేవలం ఆరు నుంచి ఏడు విమానాలను మాత్రమే తిప్పుతుందని సివిల్ ఏవియేషన్ సెక్రటరీ ప్రదీప్ సింగ్ వెల్లడించారు.