మరో సీక్వెల్ కి ప్లాన్ చేసిన విశాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో సీక్వెల్ కి ప్లాన్ చేసిన విశాల్

  • క్రితం ఏడాది హిట్ కొట్టిన 'ఇరుంబు తిరై'
  • సీక్వెల్ దిశగా మొదలైన సన్నాహాలు
  • ఆనంద్ దర్శకత్వంలో సెట్స్ పైకి    
తమిళనాట మాస్ హీరోగా విశాల్ కి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. అందువల్లనే ఆయన తన సినిమాల్లో మాస్ అంశాలు మిస్ కాకుండా చూసుకుంటాడు. ప్రస్తుతం ఆయన 'అయోగ్య' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేపనిలో వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన 'ఇరుంబు తిరై'కి సీక్వెల్ చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. క్రితం ఏడాది తమిళంలో భారీ విజయాలను సాధించిన చిత్రాల జాబితాలో 'ఇరుంబు తిరై' పేరు కూడా కనిపిస్తుంది.

మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్ సరసన సమంత కథానాయికగా నటించగా, ప్రతినాయకుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ కనిపించాడు. ఆ సినిమా విశాల్ కి నటనపరంగా మంచి మార్కులు కూడా తెచ్చిపెట్టింది. అందువల్లనే 'ఇరుంబు తిరై 2'తో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సీక్వెల్ కి మిత్రన్ కాకుండా ఆనంద్ దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. విశాల్ సొంత బ్యానర్ పైనే ఈ సినిమా నిర్మితం కానుంది. 
vishal

More Telugu News