'ఆకాశవాణి' సినిమా అప్ డేట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆకాశవాణి' సినిమా అప్ డేట్

  • నిర్మాతగా రాజమౌళి తనయుడు కార్తికేయ
  • దర్శకుడిగా అశ్విన్ గంగరాజు  పరిచయం
  • ప్రేక్షకులను థ్రిల్ చేసే కంటెంట్    
కొత్త కాన్సెప్ట్ తో కూడిన కథలను తెరపైకి తీసుకురావడానికి యువ దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. అదే బాటలో అడుగులు వేయాలనే ఉద్దేశంతో రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా మారాడు. అశ్విన్ గంగరాజును దర్శకుడిగా పరిచయం చేస్తూ, 'ఆకాశవాణి' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో నిర్మితమవుతోన్న ఈ సినిమా, ఇంతవరకూ 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది.

ఇటీవలే 'పాడేరు' సమీపంలోని అటవీ ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు చేసుకుంటున్నారు. తెలుగు తెరపై ఈ సినిమా ఒక ప్రయోగమనీ .. ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని చెబుతున్నారు. తారాగణం పరంగా చిన్న సినిమాలా కనిపించినప్పటికీ. కావాల్సినంత కొత్తదనం ఉంటుందని చెబుతున్నారు. పెద్ద విజయాలను సాధించిన చిన్న సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
karthikeya
ashwin

More Telugu News