బాణసంచా కాల్చిన వైసీపీ కార్యకర్తలు... నిప్పురవ్వలు అంటుకుని 29 పూరిళ్లు దగ్ధం!
- నెల్లిమర్లలో ప్రచారం నిర్వహించిన బడుకొండ
- పెద్ద ఎత్తున బాణసంచా కాల్చిన కార్యకర్తలు
- రూ.40 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాధితులు సర్వం కోల్పోయారు. ఇళ్లల్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.40 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా.