జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలి: శాసనసభలో సీఎం ఒమర్ అబ్దుల్లా తీర్మానం

జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలి: శాసనసభలో సీఎం ఒమర్ అబ్దుల్లా తీర్మానం

Restore full statehood to Jammu and Kashmir CM Omar Abdullah moves resolution in Assembly
  • పూర్తి రాష్ట్ర హోదా కోసం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఒమర్ అబ్దుల్లా
  • రాష్ట్ర హోదా ఇస్తామని మోదీ స్వయంగా హామీ ఇచ్చారన్న సీఎం
  • వెంటనే పూర్తి రాష్ట్ర హోదాను కల్పించాలని కేంద్రాన్ని కోరిన వైనం

జమ్మూకశ్మీర్‌కు వెంటనే పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం అక్కడ తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది. సభలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తయిన అనంతరం సీఎం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.


2000 జూన్ 26న (స్వయంప్రతిపత్తిపై ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలో), 2024 నవంబర్ 6న (ప్రత్యేక హోదా పునరుద్ధరణపై) పాస్ చేసిన తీర్మానాలకు కొనసాగింపుగా, జమ్మూకశ్మీర్‌కు తక్షణమే పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ తీర్మానం ద్వారా కోరారు.


నియోజకవర్గాల పునర్విభజన, ఆ తర్వాత ఎన్నికలు, అనంతరం రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేస్తామని స్వయంగా ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ఒమర్ అబ్దుల్లా గుర్తుచేశారు. ఇప్పటికే రెండు దశలు పూర్తయినా మూడో దశ అయిన రాష్ట్ర హోదా ప్రక్రియ నిలిచిపోయిందని అన్నారు. మరోవైపు, తీర్మానంలో 2000 జూన్ 26 నాటి 'స్వయంప్రతిపత్తి' తీర్మానాన్ని ప్రస్తావించడంపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisement
Omar Abdullah
Jammu and Kashmir statehood
JK Assembly resolution
Jammu and Kashmir full statehood restoration
Jammu and Kashmir politics
PM Modi JK promise

More Telugu News