క్రికెట్‌లో సంచలనం.. ఆఫ్ఘనిస్థాన్‌కు షాకిచ్చిన నేపాల్
- క్రికెట్‌లో సంచలనం సృష్టించిన నేపాల్ జట్టు
- గ్రూప్-ఏ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు
- నేపాల్ స్పిన్నర్ల ధాటికి 102 పరుగులకే కుప్పకూలిన ఆఫ్ఘన్
- సుందీప్ జోరా, రోహిత్ పౌడెల్ కీలక ఇన్నింగ్స్‌లతో నేపాల్ ఛేదన
- ఈ ఓటమితో ఆఫ్ఘనిస్థాన్ క్వార్టర్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం
క్రికెట్‌లో నేపాల్ జట్టు సంచలనం సృష్టించింది. కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరిగిన ఆసియా క్రీడల గ్రూప్-ఏ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పటిష్ఠమైన ఆఫ్ఘనిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించి ఆఫ్ఘన్ జట్టుకు షాకిచ్చింది. మొదట బౌలర్లు కట్టడి చేయగా, ఆ తర్వాత బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడి జట్టును గెలిపించారు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్‌ను నేపాల్ స్పిన్నర్లు కుశాల్ భుర్టెల్, లలిత్ రాజ్‌బంశీ తమ స్పిన్‌తో కట్టిపడేశారు. వీరి ధాటికి ఆఫ్ఘన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. భుర్టెల్ 4 వికెట్లు పడగొట్టగా, రాజ్‌బంశీ కేవలం 13 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ స్వేచ్ఛగా ఆడలేకపోయింది. ఫైసల్ షినోజాదా (30), నజీబుల్లా జద్రాన్ (30) మాత్రమే కాస్త పోరాడటంతో ఆఫ్ఘన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 102 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అనంతరం 103 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు భుర్టెల్ (0), ఆసిఫ్ షేక్ (2) త్వరగా ఔటయ్యారు. కుశాల్ మల్లా కూడా రనౌట్ కావడంతో నేపాల్ 6.3 ఓవర్లలో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సుందీప్ జోరా (34), రోహిత్ పౌడెల్ (33 నాటౌట్) బాధ్యతాయుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకొని, స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు నడిపించారు.
కీలక సమయంలో సుందీప్ జోరా రనౌట్ అయినా, కెప్టెన్ దీపేంద్ర సింగ్ ఐరీ (15)తో కలిసి రోహిత్ పౌడెల్ జట్టును విజయానికి చేరువ చేశాడు. పౌడెల్ 16, 17 ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టి ఒత్తిడి తగ్గించాడు. విజయానికి ఒక్క పరుగు దూరంలో దీపేంద్ర ఔటైనా, గుల్షన్ ఝా సింగిల్ తీసి లాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఈ విజయంతో నేపాల్ తమ ఖాతా తెరిచింది. గ్రూప్-ఏలో ఆఫ్ఘనిస్థాన్ రెండు మ్యాచ్‌లలో ఒకటి గెలిచి, ఒకటి ఓడినా.. మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా టేబుల్‌లో అగ్రస్థానంలో ఉంది. నేపాల్ తన తదుపరి మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది. గ్రూప్‌లో టాప్-2 జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.