దాదర్ రైల్వే స్టేషన్‌లో తిరుపతి వజ్ర కిరీటాల దొంగ అరెస్ట్!
- ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు
- సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి గుర్తింపు
- నిందితుడి కదలికలపై నిఘా
- పూర్తి విచారణ నిర్వహించనున్న పోలీసులు
ఆలయంలోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఓ వ్యక్తిని గుర్తించి, అతనికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఆ వ్యక్తిని మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించి అతడి కదలికలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో నిందితుడు పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు నేడు దాదర్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. తిరుపతికి తీసుకొచ్చి పూర్తి స్థాయి విచారణ నిర్వహించనున్నారు.