కార్తికేయ ఇతర హీరోల ఛాన్సులు తన్నుకుపోయేలా వున్నాడు: జేడీ చక్రవర్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కార్తికేయ ఇతర హీరోల ఛాన్సులు తన్నుకుపోయేలా వున్నాడు: జేడీ చక్రవర్తి

  • షూటింగు దశలో 'హిప్పీ' 
  • కార్తికేయకి మంచి భవిష్యత్తు వుందన్న జేడీ
  • దిగాంగనపై ప్రశంసలు      
'ఆర్ ఎక్స్ 100' సినిమాతో కార్తికేయ యూత్ లో విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకున్నాడు. ఆ తరువాత రెండు ప్రాజెక్టులను ఆయన పట్టాలెక్కించాడు. అందులో ఒకటిగా 'హిప్పీ' సినిమా రూపొందుతోంది. టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో జేడీ చక్రవర్తి ఒక కీలకమైన పాత్రను పోషిస్తుండగా, కథానాయికగా దిగాంగన కనిపించనుంది.

ఈ సినిమా అప్ డేట్స్ ను ఇవ్వడం కోసం నిన్న రాత్రి యూనిట్ సభ్యులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేదికపై జేడీ చక్రవర్తి మాట్లాడుతూ .. "మొదటిరోజు నేను సెట్లోకి అడుగుపెట్టేసరికి కార్తికేయపై యాక్షన్ సీన్ తీస్తున్నారు. మనోడి ఫెర్పార్మెన్స్ చూసి.. మిగతా హీరోల అవకాశాలను తన్నుకుపోయేలా ఉన్నాడుగా అనుకున్నాను. హీరోగా ఆయనకి మంచి భవిష్యత్తు వుంది. ఇక దిగాంగన అందమైన అమ్మాయే కాదు .. చురుకైన అమ్మాయి కూడా .. చాలా బాగా చేస్తోంది" అంటూ చెప్పుకొచ్చాడు.
karthikeya
digangana

More Telugu News