ఏపీకి ప్రత్యేక హోదా కోసం పూర్తి సహకారం అందిస్తాం: కేజ్రీవాల్
- దేశంలో ఎన్నో సమస్యలు సృష్టించారు
- చంద్రబాబు మరోసారి సీఎం కావాలి
- ఎన్నికలు ఏపీకి చాలా కీలకం
మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే అమిత్‌షాతో కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారన్నారు. ప్రశాంతంగా ఉండే దేశంలో కుల, మతాల పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టారని కేజ్రీవాల్ విమర్శించారు. నోట్ల రద్దుతో వ్యాపారాలు దెబ్బతిన్నాయని, వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. నోట్ల రద్దు పెద్ద కుంభకోణమని ఇప్పుడు తెలుస్తోందని, మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే హిట్లర్ పాలన వస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.