సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన ధోని.. ఆమ్రపాలి సంస్థ నుంచి రూ.38.95 కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి!
- ఆమ్రపాలి గ్రూప్ నకు బ్రాండ్ అంబాసిడర్ గా ధోని
- వినియోగదారులను మోసం చేసిన సంస్థ
- అర్థంతరంగా ఒప్పందం నుంచి తప్పుకున్న ధోని
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ కు ధోని 2009-16 మధ్యకాలంలో ప్రచారకర్తగా వ్యవహరించారు. అయితే ఈ గ్రూప్ 46,000 మంది వినియోగదారులను మోసం చేయడంతో అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమ్రపాలి గ్రూప్ తో తన ఒప్పందాన్ని ధోని అర్ధంతరంగా రద్దుచేసుకున్నారు. అప్పటివరకూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినందుకు రూ.38.95 కోట్లు చెల్లించాలని కోరారు.