అవును, ఒంగోలు సీటు ఆశించాను: స్పందించిన వైవీ సుబ్బారెడ్డి
- సుబ్బారెడ్డి జగన్ పై అలిగారని వార్తలు
- అందుకే విదేశాలకు వెళ్లారని కథనాలు
- ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చిన జగన్ చిన్నాన్న
ప్రస్తుతం తాను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పారు. తాను ఒంగోలు లోక్ సభ సీటును ఆశించానని, అయితే మాగుంటకు టికెట్ ఇవ్వడం పార్టీ నిర్ణయమని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ సీటు ఇస్తామని జగన్ చెప్పారనీ, అయితే ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించానని వెల్లడించారు. తనకు ప్రత్యక్ష రాజకీయాలు అంటేనే ఆసక్తి అని వ్యాఖ్యానించారు. తాను ఇన్‌ఛార్జిగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అన్ని జిల్లాల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.