45 స్థానాలపై స్పష్టత, మరోసారి వారణాసి నుంచి మోదీ పోటీ!
- అభ్యర్థుల తుది జాబితాపై కసరత్తు
- మోదీ అధ్యక్షతన సమావేశం
- లక్నో నుంచి రాజ్నాథ్ పోటీ
- మధుర నుంచి హేమమాలిని
ఈ సమావేశంలో యూపీలో 80 స్థానాలకు గాను, 45 స్థానాలపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనుండగా, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి లక్నో నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. మధుర నుంచి హేమమాలిని, అమేథీ నుంచి స్మృతి ఇరానీ పోటీ పడనున్నట్టు సమాచారం.