నేడు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న బైరెడ్డి.. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఐజయ్య కూడా!
- మరి కాసేపట్లో చంద్రబాబును కలవనున్న బైరెడ్డి, ఐజయ్య
- నందికొట్కూరు టికెట్ విషయంలో ఐజయ్యకు జగన్ మొండిచేయి
- ఆ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి జయరాజ్
నందికొట్కూరు టికెట్‌ను తనకు కాదని అర్ధర్‌కు కేటాయించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఐజయ్య పార్టీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నేడు బైరెడ్డితో కలిసి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అయితే, నందికొట్కూరు టికెట్‌ను టీడీపీ ఇప్పటికే బండి జయరాజుకు కేటాయించిన నేపథ్యంలో ఐజయ్య పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది.