మహేశ్ బాబు 26వ సినిమాకి రంగం సిద్ధం
- మే 9వ తేదీన 'మహర్షి' విడుదల
- తదుపరి సినిమాకి సన్నాహాలు
- వచ్చేనెలలో లాంచ్ చేసే అవకాశం
తాను దర్శకత్వం వహించే 5వ సినిమాకి సంబంధించిన కథకి తుది మెరుగులు దిద్దుతున్నాననీ, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతోందని ఆయన ట్వీట్ చేశాడు. మహేశ్ బాబు 26వ సినిమాకి సంబంధించిన రంగం సిద్ధమైందంటూ ఆయన ఇలా హింట్ ఇచ్చాడు. బహుశా వచ్చే నెలలో ఈ సినిమాను లాంచ్ చేసి, 'మహర్షి' విడుదలైన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని అనుకోవచ్చు. ఈ సినిమా కోసం ఇద్దరు కథానాయికలు అవసరమవుతారట. ఒక కథానాయికగా రష్మిక మందన పేరు వినిపిస్తోంది.