సిరీస్ ఫలితం తేల్చే మ్యాచ్ లో ఓటమి దిశగా భారత్
- లక్ష్యఛేదనలో విఫలమైన టాపార్డర్
- నిరాశపర్చిన ధావన్, పంత్
- రాణించని కోహ్లీ
అంతకుముందు, టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (100) సెంచరీ సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 272 పరుగులు చేసింది పర్యాటక జట్టు. హ్యాండ్స్ కోంబ్ మరోసారి ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడి 52 పరుగులు జతచేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, షమీ 2, జడేజా 2 వికెట్లు తీశారు. ఐదు వన్డేల సిరీస్ లో ఇది చివరి మ్యాచ్. ఇరు జట్లు 2-2తో సిరీస్ లో సమవుజ్జీలుగా నిలిచిన తరుణంలో ఈ మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది.