షూటింగులో హీరో విశాల్ కు గాయాలు
- ఎన్టీఆర్ 'టెంపర్'ను తమిళంలో 'అయోగ్య'గా రీమేక్ చేస్తున్న విశాల్
- కష్టమైన స్టెప్పును ప్రాక్టీస్ చేసే సమయంలో ప్రమాదం
- ఆందోళన చెందుతున్న విశాల్ అభిమానులు
తెలుగులో ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సినిమాను తమిళంలో 'అయోగ్య'గా విశాల్ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ సాంగ్ ను షూట్ చేస్తున్న సమయంలో విశాల్ గాయపడ్డాడు. ఒక కష్టమైన స్టెప్ ను ప్రాక్టీస్ చేసే సమయంలో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన మోచేతికి, కాలికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న విశాల్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.