సైనిక త్యాగాలను ప్రచారానికి వాడుకోకండి: రాజకీయ పార్టీలకు ఈసీ ఆదేశం

  • పోస్టర్లపై సైనికుల ఫొటోలు ఉంచరాదని సూచన
  • పైలట్‌ అభినందన్‌ ఫొటో వినియోగించిన బీజేపీ నేత
  • తన దృష్టికి రావడంతో స్పందించిన ఎన్నికల సంఘం
సైనికుల త్యాగాలను రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా హెచ్చరించింది. ఈ విషయంలో రాజకీయ పార్టీల అధినాయకత్వం తమ కేడర్‌కు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు, పాకిస్థాన్‌ సైన్యానికి భారత్‌ వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ చిక్కడం, ఆ తర్వాత ఇరుదేశాల మధ్య చర్చల్లో భాగంగా ఆయన విడుదల కావడం, వాఘా సరిహద్దులో అతన్ని అప్పగించిన సందర్భంగా ఉద్విగ్నపరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలతో అభినందన్‌ ఒక్కసారిగా రియల్‌ హీరోలా మారిపోయారు.

దేశవ్యాప్తంగా అభినందన్‌తో ఉన్న హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటుచేసి అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇదే అదనుగా ఓ బీజేపీ సీనియర్‌ నాయకుడు తయారు చేయించుకున్న హోర్డింగ్‌లో అభినందన్‌ ఫొటో వాడారు. ఈ హోర్డింగ్‌ కాస్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొట్టి వైరల్‌గా మారడంతో ఎన్నికలు సంఘం దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన ఈసీ సైనికుల ఫొటోలు వాడరాదంటూ ఆదేశాలు జారీ చేసింది.
Go Back to Shorts
election commission
soldiers
photos on baners

More Telugu News