ఇస్లామాబాద్ నుంచి లాహోర్ కు విమానంలో అభినందన్ తరలింపు!
- ప్రమాదవశాత్తూ పాక్ భూభాగంలో దిగిన అభినందన్
- మధ్యాహ్నం 2 గంటల తరువాత అప్పగింత
- వాఘా సరిహద్దుల వద్ద సందడి
అక్కడి నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాఘా బార్డర్ కు ఆయన్ను రోడ్డు మార్గంలో తీసుకువచ్చి భారత వాయుసేనకు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే వాఘా బార్డర్ వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు, అధికారులు చేరిపోగా, అభినందన్ ను కవర్ చేసేందుకు మీడియా సంస్థలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశాయి.