సీనియర్ నటుడు రంగనాథ్ గారి మరణం నన్ను ఆలోచింపజేసింది: 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా
- వృద్ధాశ్రమ నిర్మాణం నా జీవితాశయం
- దాతలు ముందుకు వచ్చారు
- స్థలాల పరిశీలన జరుగుతోంది
ఈ వేదికపై శివాజీరాజా మాట్లాడుతూ .. "మా అసోసియేషన్ తరఫున ఇప్పటికే కొన్ని పథకాలు వున్నాయి. ఆ జాబితాలో 'వృద్ధాశ్రమం' కూడా చేర్చాలనేది నా జీవితాశయం. సీనియర్ ఆర్టిస్ట్ రంగనాథ్ గారు చనిపోయిన తరువాత నాకు ఈ ఆలోచన వచ్చింది. నా ఆలోచనను సమర్ధిస్తూ కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చారు .. స్థలాల పరిశీలన జరుగుతోంది. 16 యేళ్ల క్రితం ప్రమాదంలో చనిపోవలసిన నేను బ్రతికుండటమే బోనస్. అందుకే మంచి పనులు చేయడానికి సంకల్పించాను" అంటూ చెప్పుకొచ్చారు.