'యమలీల' కోసం ముందుగా మహేశ్ బాబును అనుకున్నారు: కమెడియన్ అలీ
Add ap7am to your home Screen

'యమలీల' కోసం ముందుగా మహేశ్ బాబును అనుకున్నారు: కమెడియన్ అలీ

  • 'యమలీల' కథను కృష్ణగారు విన్నారు
  •  మహేశ్ బాబు చదువు పూర్తికాలేదు
  •  కమెడియన్ వేషాలు వదల్లేదు  
తెలుగు తెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను ఆరంభించిన అలీ, ఆనాటి నుంచి నాన్ స్టాప్ గా నటుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే వస్తున్నాడు. మధ్యలో కొన్నాళ్లు హాస్యభరిత చిత్రాల్లో హీరోగాను సందడి చేశాడు. అలా నటుడిగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అలీ, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించాడు.

"ఎస్వీ కృష్ణారెడ్డి గారు 'యమలీల' కథను మహేశ్ బాబును దృష్టిలో పెట్టుకునే సిద్ధం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి విమానంలో వెళుతోన్న సందర్భంలో కృష్ణారెడ్డిగారు ఈ కథను కృష్ణగారికి వినిపించారు. అయితే, మహేశ్ బాబు చదువు పూర్తికావడానికి సమయం పడుతుందనీ, అప్పటివరకూ సినిమాలు చేయడని కృష్ణగారు చెప్పారట. అప్పుడు కృష్ణారెడ్డి గారి దృష్టిలో నేను పడ్డాను.

నన్ను హీరోగా పెట్టుకోవద్దని కూడా ఆయనకి చాలామంది చెప్పారు. అయితే ఆయన కథను నమ్మారు .. అందువల్లనే ఆ సినిమా సూపర్ హిట్ అయింది. హీరోగా ఒక సినిమా హిట్ కాగానే నా అంత తోపు ఎవరూ లేడని నేను అనుకోలేదు. అందువల్లనే కమెడియన్ వేషాలను వదులుకోలేదు" అని చెప్పుకొచ్చాడు. 
ali

More Telugu News