చివరి బంతికి గెల్చిన ఆసీస్... ఉసూరుమన్న టీమిండియా
- కడవరకు పోరాడిన కోహ్లీ సేన
- స్వల్ప లక్ష్యాన్ని కాచుకునేందుకు విఫలయత్నం
- తొలి టి20 ఆసీస్ కైవసం
వైజాగ్ ఆతిథ్యం ఇచ్చిన ఈ మ్యాచ్ లో మొదట భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో రాహుల్ చలవతో 7 వికెట్లకు 126 పరుగులు చేసింది. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ కు ఓపెనర్ డార్సీ షార్ట్ 37, గ్లెన్ మ్యాక్స్ వెల్ 56 పరుగులతో విజయానికి బాటలు వేశారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో బుమ్రా వరుస బంతుల్లో హ్యాండ్స్ కోంబ్, కౌల్టర్ నైల్ లను వెనక్కి పంపినా ప్రయోజనం లేకపోయింది.