అందువల్లనే చాలా కాలం నుంచి సినిమాలు చేయడం లేదు: సీనియర్ నటి విజయలలిత
Add ap7am to your home Screen

అందువల్లనే చాలా కాలం నుంచి సినిమాలు చేయడం లేదు: సీనియర్ నటి విజయలలిత

  • చిన్నప్పుడే చెన్నైకి వచ్చేశాను
  • ఓ పదేళ్ల పాటు వరుస సినిమాలు
  •  నా చివరి సినిమా 'సాహసవీరుడు సాగర కన్య'     
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సీనియర్ నటి విజయలలిత మాట్లాడుతూ, ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. "మా అమ్మగారి వాళ్ల సొంత ఊరు రాజమండ్రి దగ్గరున్న 'అనపర్తి' .. మా నాన్నవాళ్ల సొంత వూరు వరంగల్ దగ్గరున్న 'ఏటూరు నాగారం'. నా ఏడేళ్ల వయసులో నన్ను చెన్నైకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్నాను. ఆ డాన్స్ కారణంగానే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

ఓ పదేళ్ల పాటు ఇంటికి వెళ్లడానికి కూడా నాకు తీరికలేనంత బిజీగా గడిపాను. మా అమ్మగారే స్టూడియోలకి వచ్చి నన్ను చూసి వెళుతూ ఉండేవారు. తెలుగులో నా చివరి చిత్రం 'సాహసవీరుడు సాగరకన్య. ఆ తరువాత సినిమాలు చేయలేదు. ఒక వయసు వచ్చిన తరువాత అన్నిరకాల పాత్రలు చేయలేము. ఒక స్థాయికి వచ్చాక ప్రాధాన్యత కలిగిన పాత్రలు మాత్రమే చేయాలి. అలాంటి పాత్రలు రాకపోవడం వల్లనే అప్పటి నుంచి సినిమాలు చేయలేకపోయాను" అన్నారు.
vijayalalita
ali

More Telugu News