మహేశ్ బాబు సొంత బ్యానర్లోనే అనిల్ రావిపూడి మూవీ
- 'మహర్షి' సినిమాతో బిజీగా మహేశ్
- తదుపరి సినిమా సుకుమార్ తో
- అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్
ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి చకాచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడితో ప్రాజెక్టును కూడా మహేశ్ బాబు ఖాయం చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే అనిల్ రావిపూడి మహేశ్ ను కలిసి కథను వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. మహేశ్ బాబు సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతుందని సమాచారం. అనిల్ సుంకర నిర్మాణ భాగస్వామిగా ఉంటాడని చెబుతున్నారు. మొత్తానికి అనిల్ రావిపూడి .. మహేశ్ బాబును లైన్లో పెట్టేశాడన్న మాట.