శర్వానంద్ కోసం రంగంలోకి దిగిన చందూ మొండేటి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శర్వానంద్ కోసం రంగంలోకి దిగిన చందూ మొండేటి

  • 'ప్రేమమ్' తో హిట్ 
  • 'సవ్యసాచి'తో పరాజయం
  • శర్వానంద్ కి కథ వినిపించిన చందూ     
'కార్తికేయ' సినిమాతో దర్శకుడిగా చందూ మొండేటి తన సత్తా చాటుకున్నాడు. దాంతో ఆయన నాగార్జున దృష్టిలో పడటం .. చైతూతో 'ప్రేమమ్' చేయడం జరిగిపోయాయి. 'ప్రేమమ్' హిట్ కావడంతో చైతూతోనే 'సవ్యసాచి' చేసే ఛాన్స్ వచ్చింది. అయితే 'సవ్యసాచి' ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది.

ఈ సినిమాకి ముందు అన్నపూర్ణ బ్యానర్లోనే చందూ మొండేటి మరో ప్రాజెక్టు చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే 'సవ్యసాచి' పరాజయంపాలు కావడంతో, ఆయన మరో హీరోను వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలోనే శర్వానంద్ పై ఆయన దృష్టిపడింది. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ ఒక సినిమా చేస్తున్నాడు. సుధీర్ వర్మ తనకి మంచి స్నేహితుడు కావడంతో, ఆయన ద్వారా శర్వానంద్ ను కలిసిన చందూ మొండేటి ఒక మంచి కథ చెప్పాడట. ఈ కథపై శర్వానంద్ పాజిటివ్ గా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
chandu mondeti

More Telugu News