వచ్చే సంక్రాంతికి 'ఎఫ్ 3' ఉంటుంది: దర్శకుడు అనిల్ రావిపూడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వచ్చే సంక్రాంతికి 'ఎఫ్ 3' ఉంటుంది: దర్శకుడు అనిల్ రావిపూడి

  • 'ఎఫ్ 3' తప్పకుండా ఉంటుంది
  • ఆ పాత్రల నిడివి పెంచుతున్నాము
  • దిల్ రాజు నాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చారు
ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా దర్శకుడు అనిల్ రావిపూడి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. 'ఎఫ్ 2'తో ఆయన వరుసగా నాలుగో విజయాన్ని అందుకోవడమే అందుకు కారణం. ఈ సినిమా సక్సెస్ తో తనపై తనకి మరింత నమ్మకం పెరిగిందన్న అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

"అభిమానులు నా నుంచి ఆశిస్తున్నట్టుగానే 'ఎఫ్ 3' సినిమా ఉంటుంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన లైన్ ను డెవలప్ చేస్తున్నాము. శ్రీనివాస్ రెడ్డి .. రఘుబాబు .. గన్ మ్యాన్ పాత్రల నిడివి 'ఎఫ్ 3'లో ఎక్కువగా ఉండేలా చూస్తున్నాము. దిల్ రాజు గారి బ్యానర్లో నేను చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకోవడానికి కారణం ఆయన నాకు ఇచ్చిన స్వేచ్ఛ. నాపై ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను నా వంతు కృషి చేస్తున్నాను. ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఆయన సలహాలు .. సూచనలు తప్పకుండా తీసుకుంటాను. ఆయనకి గల అనుభవాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తూనే వుంటాను" అని చెప్పుకొచ్చాడు.
anil ravipudi
dil raju

More Telugu News