ఫేస్‌బుక్ పోస్టుకు అసభ్య కామెంట్.. ఇంటికి పిలిపించి చావగొట్టిన వివాహిత
- యువకుడిని ఇంటికి పిలిపించి దాడి
- స్నేహితులతో కలిసి మరోమారు దాడి చేసిన వివాహిత కుమారుడు
- వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్
సాదిక్‌ను ఇంటికి పిలిపించిన మహిళ అతడిని బెడ్ రూములోకి తీసుకెళ్లి, బూతులు తిడుతూ ఎడాపెడా చెంపలు వాయించింది. అక్కడే ఉన్న ఆమె కుమారుడు శరత్ కుమార్, అతడి స్నేహితులు కూడా సాదిక్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత చిత్తూరులోని ఓ కల్యాణ మండపం వద్ద సాదిక్‌పై మరోమారు దాడిచేశారు. ముఖంపై కొడుతూ, కడుపులో తన్నుతూ విచక్షణ రహితంగా కొట్టారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.