కోహ్లీకి విశ్రాంతి.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ
- కోహ్లీపై విపరీతమైన పనిభారం
- విశ్రాంతి ఇచ్చినట్టు పేర్కొన్న బీసీసీఐ
- సారథ్యం వహించనున్న రోహిత్
గతేడాది శ్రీలంకలో జరిగిన నిదహాస్ ట్రోఫీ నుంచి కోహ్లీకి విశ్రాంతి ఇస్తూ వస్తోంది. జూన్‌లో బెంగళూరులో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌తోపాటు సెప్టెంబరులో యూఏఈలో జరిగిన ఆసియా కప్, విండీస్‌తో నవంబరులో జరిగిన టీ20 సిరీస్‌ల నుంచి కోహ్లీకి విశ్రాంతి ఇచ్చింది. కోహ్లీ స్థానంలో ఓపెనర్ రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించింది. గతేడాది కోహ్లీ మొత్తం 15 టెస్టులు ఆడి 1345 పరుగులు చేశాడు. అలాగే 18 వన్డేల్లో 1400 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.