దావోస్ సదస్సులో ‘ఏపీ మెడ్ టెక్ స్టాల్’.. భారత్ కు గర్వకారణమన్న వీరేంద్ర సెహ్వాగ్!
- విశాఖలో మెడ్ టెక్ జోన్
- ప్రశంసలు కురిపించిన మాజీ క్రికెటర్
- 250 కంపెనీల సామర్థ్యంలో మెడ్ టెక్ జోన్
అత్యాధునిక మెడికల్ పరికరాల తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘మెడ్ టెక్ జోన్’ అద్భుతమని కితాబిచ్చాడు. ఈ క్లస్టర్ జోన్ భారత్ కు గర్వకారణంగా మారబోతోందని వ్యాఖ్యానించాడు. ఈ స్టాల్ కు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో వీరూ పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ కు డబ్ల్యూఈఎఫ్ వెబ్ సైట్ లింక్ ను జతచేశాడు. దాదాపు 250 మెడికల్ కంపెనీలు తమ ఉత్పత్తులను రూపొందించేందుకు ప్రత్యేకంగా మెడ్ టెక్ జోన్ ను ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

